TATA Stryder : ఈ టాటా ఎలక్ట్రిక్ బైక్‌పై కిలోమీటర్‌కి పది పైసలే ఖర్చు
TATA Stryder ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ బాగా వాడుకలోకి వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఈ బైక్స్‌ని దింపేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్లతో, ఆకట్టుకునే ఫీచర్లతో వీటిని తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ టాటాకు చెందిన బ్రాండ్ టాట స్ట్రైడర్ నుంచి ‘స్ట్రైడర్ జీటా’ పేరుతో కొత్త ఈ బైక్ మార్కెట్లోకి రిలీజ్ అయింది.
TATA Stryder ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ బాగా వాడుకలోకి వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఈ బైక్స్‌ని దింపేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్లతో, ఆకట్టుకునే ఫీచర్లతో వీటిని తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ టాటాకు చెందిన బ్రాండ్ టాట స్ట్రైడర్ నుంచి ‘స్ట్రైడర్ జీటా’ పేరుతో కొత్త ఈ బైక్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. బ్యాటరీతో నడిచే ఈ సైకిల్ని ఛార్జ్ చేసి ఉపయోగించుకోవచ్చు. ప్రతి కిలోమీటర్కీ పది పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని 100 కిలోమీటర్లు వెళ్లడానికి పది రూపాయలు మాత్రమే అవుతుందని కంపెనీ చెబుతోంది.
దీని ధర రూ.31,999. ప్రస్తుతం ఇది డిస్కౌంట్ ప్రైస్‌తో రూ.25,599కే అందుబాటులో ఉంది. స్ట్రైడర్ జీటా ఇ-బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే పెడల్, ఎలక్ట్రిక్ మోడ్ కలిపి 40 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో అయితే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. వేగం విషయానికి వస్తే ఎలక్ట్రిక్ మోడ్‌లో గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే స్ట్రైడర్ జీటా ఇ-బైక్ గ్రీన్, గ్రే కలర్స్‌లో లభిస్తుంది. ఈ బైక్ లోపల లిథియం అయాన్ బ్యాటరీ, కంట్రోలర్ ఉంటాయి. ఇందులో 36V 250 W BLDC రియర్ హబ్ మోటార్ ఉంది. ఇది చాలా శక్తివంతమైన మోటర్ అని దీనితో అన్ని రకాల భూభాగాలపై ఈజీగా రైడ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.