»Indian Is The First Place In The List Of Donors Despite The Passing Of Centuries The Truth Is Hidden In The History Books
Jamsetji Tata: శతాబ్దాలుగా దాతల లిస్ట్‌లో మొదటి స్థానం భారతీయుడిదే..చరిత్రపుటల్లో దాగిన నిజం!
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్థిక సాయం చేసిన వారిలో టాప్ 50లో భారతీయుడు జంషెడ్ జి.టాటా మొదటి స్థానంలో నిలిచారు. ఆయన చనిపోయి వందేళ్లకు పైగా అవుతున్నా ఇప్పటికీ ఆయనే నెంబర్1 స్థానంలో నిలవడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది దానం చేస్తుంటారు. అనేక సంస్థలకు, ప్రజలకు తమ సాయం అందించి దాతృత్వం చాటుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో గత వందేళ్లలో అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారి జాబితా విడుదలైంది. అందులో మొదటి స్థానంలో ఉన్నది మన భారతీయుడే. గత శతాబ్దకాలంలో టాప్ 50 దాతల జాబితాలో నంబర్ 1 వ్యక్తిగా జమ్ షేడ్జీ టాటా (Jamsetji Tata) చరిత్రకెక్కారు. ఆయన చనిపోయిన వందేళ్లు అయినా ఇప్పటికీ ఆయనే టాప్‌లో ఉండటం విశేషం.
ఉప్పు నుంచి నేడు సాఫ్ట్‌వేర్‌గా ఎదిగిన టాటా సామ్రాజ్యానికి మూల పురుషుడే మన జమ్ షేడ్జీ టాటా. జమ్ షేడ్జీ టాటా ఇచ్చిన విరాళం మొత్తం 10,200 కోట్ల అమెరికన్ డాలర్లు కావడం విశేషం. 1839 మార్చి 3వ తేదిన జమ్ షేడ్జీ నుసర్వాన్జీ టాటా(Jamsetji Tata) జన్మించారు. 1904 మే 19న ఆయన మరణించాడు. ఆయన చనిపోయి 117 ఏళ్లు గడిచినా ఇప్పటికే నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విరాళం ఇచ్చిన టాప్ 50 దాతల లిస్ట్‌ను హురాన్ రిపోర్ట్, ఎడెల్జీన్ ఫౌండేషన్ సంయుక్తంగా రిలీజ్ చేశాయి.
టాటా తర్వాత బిల్ గేట్స్(billgates), మెలిండా గేట్స్‌లు 7460 కోట్ల యూస్ డాలర్లను విరాళం ఇచ్చారు. వారి తర్వాత వారెన్ బఫెట్ 3740 మిలియన్ యూస్ డాలర్లు విరాళంగా అందించారు. గత శతాబ్దంలో అమెరికన్లు, యూరోపియన్లు ఎక్కువగా దానాలు చేస్తూ ముందుండేవారు. అయితే భారతదేశానికి చెందిన టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ జి.టాటా మాత్రం ప్రపంచంలోనే అతి పెద్ద దాత అని పరిశోధకుడు రూపర్ట్ హూగ్వెర్ఫ్ ప్రకటనలో తెలిపాడు.
102.4 బిలియన్ డాలర్ల విలువైన డబ్బును అంటే మన దేశ కరెన్సీలో 10,200 కోట్లను జంషెడ్ జి.టాటా(Jamsetji Tata) విరాళంగా అందించి ప్రపంచంలోనే అతి పెద్ద దాతృత్వవేత్తగా ఎంపికయ్యారు. జంషెడ్ జీ 1892 నుంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ప్రారంభించి అనేక సేవలను అందించారు. ఈ జాబితాలోనే మరో భారతీయుడైన విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ రూ.2200 కోట్ల అమెరికన్ డాలర్లను విరాళంగా అందజేశారు.