»British Man Kollin Hancock Surviving Triple Heart Bypass Surgery
kollin hancock: 3 సార్లు బైపాస్ సర్జరీ.. 46 ఏళ్లు అవుతున్నా ఆరోగ్యంగానే, గిన్నిస్ రికార్డ్
బ్రిటన్‌కు చెందిన కోలిన్ హాంకాక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మూడుసార్లు బైపాస్ సర్జరీ చేయించుకొని 46 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు.
British Man kollin hancock Surviving Triple Heart Bypass Surgery
kollin hancock: బ్రిటన్‌కు చెందిన కోలిన్ హాంకాక్‌కు 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు హార్ట్ డిసీజ్ బయటపడింది. వంశపారంపర్యంగా హైపర్ కొలెస్టెరోలేమియా అనే సమస్య వల్ల శరీరంలో కొవ్వు పెరగడంతో డిసీజ్ వస్తోంది. 30 ఏళ్లకే హాంకాక్‌కు గుండెపోటు వచ్చింది. మరుసటి ఏడాదిలో ఒక్కటి కాదు రెండు కాదు మూడు బైపాస్ సర్జరీలు చేశారు. ఇదే అతని జీవితంలో బాధాకరమైన రోజు. ఆ తర్వాత అతనికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ లేవు. ప్రస్తుతం అతని వయస్సు 77 ఏళ్లు.. ఇప్పటికీ అతనికి ఏ ఇతర ఆరోగ్య సమస్య లేవు.
బైపాస్ సర్జరీ చేయించుకొని ఇప్పటికే 46 ఏళ్లు అవుతోంది. కరెక్టుగా చెప్పాలంటే.. 45 ఏళ్ల 361 రోజులు అయ్యింది. ఇప్పటివరకు అతనికి ఏ ఆరోగ్య సమస్య లేదు. మరో సర్జరీ కూడా జరగలేదు. దీంతో అతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇదివరకు అమెరికాకు చెందిన డెల్బర్ట్ డేల్ మెక్ బీ పేరుతో ఆ రికార్డు ఉంది. అతను కూడా మూడుసార్లు బైపాస్ సర్జరీ చేయించుకొని 41 ఏళ్ల 63 రోజులు బతికారు. 2015లో 90వ ఏటా చనిపోయాడు.
అతని రికార్డును కోలిన్ బ్రేక్ చేశాడు. మూడు బైపాస్ సర్జరీలు చేయించుకుని 46 ఏళ్లు అవుతుంది. అయినా ఆరోగ్యంగానే ఉన్నాడు. భవిష్యత్‌లో కూడా అతని రికార్డ్‌ను బద్దలు కొట్టే వారు ఉండకపోవచ్చు. మూడు సార్లు గుండె ఆపరేషన్ చేయించుకొని, ఎక్కువ కాలం బతకడం అంటే మాములు విషయం కాదు.