»Shriya Posed For Photos With Her Daughter In The Middle Of The Greenery
Shriya : గ్రీనరీ మధ్యలో కూతురు తో ఫొటోలకు ఫోజులిచ్చిన శ్రియ
తాజాగా శ్రియ కూతురు రాధతో చుట్టూ చెట్లతో ఉన్న గ్రీనరీ మధ్యలో ఫొటోలకు ఫోజులిచ్చింది. కూతురు రాధతో దిగిన ఫోటోలని శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాశి తగ్గినా వాసి తగ్గని నటి శ్రియ. రియల్ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది.
తాజాగా శ్రియ కూతురు రాధతో చుట్టూ చెట్లతో ఉన్న గ్రీనరీ మధ్యలో ఫొటోలకు ఫోజులిచ్చింది. కూతురు రాధతో దిగిన ఫోటోలని శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది.రాశి తగ్గినా వాసి తగ్గని నటి శ్రియ. రియల్ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నది.
తాజాగా ఆమె నటించిన కన్నడ చిత్రం ‘కబ్జా’ విడుదలకు సిద్ధంగా ఉంది.మనకు ఏది రాసిపెట్టి ఉందో అదే జరుగుతుందని బలంగా విశ్వసిస్తా! దేవుణ్ని సంపూర్ణంగా నమ్ముతా. శ్రీకృష్ణ పరమాత్మ నా ఇష్టదైవం. ఆయన సంకల్పం లేనిదే ఏదీ జరగదని అనిపిస్తుంటుంది.
నాకు సినిమా అవకాశం వచ్చినప్పుడు నాన్నే స్క్రీనింగ్ టెస్ట్ కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పుడే నేను మొదటిసారి విమానం ఎక్కాను. కెరీర్ మొదట్లో అమ్మానాన్న నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నా విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నా ప్రతి మలుపులో వాళ్లున్నారని శ్రియ తెలిపింది.
నా చిట్టితల్లి రాధ (కూతురు) కూడా నాకు స్ఫూర్తినిస్తుంది. కొత్త విషయం నేర్చుకునే క్రమంలో నా బిడ్డ కనబరిచే తపన చూసి ముచ్చటేస్తుంది ఆమె అన్నారు
అమ్మదనం గొప్పదనాన్ని ప్రతిక్షణం అనుభవిస్తున్నా. నా చిట్టితల్లి పంచుతున్న ఆనందం ముందు తనకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంటుంది. తెల్లవారుతూనే రెండు చిట్టిచేతులు నా ముఖాన్ని తడుముతుంటాయి. కండ్లు తెరిచేసరికి ముసిముసి నవ్వులతో చందమామలా ముందుంటుందని శ్రియ చెప్పింది