ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా, ఇరాన్లో ఉన్న తమ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని, ఎవరూ కొత్తగా ప్రయాణించవద్దని హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచింది. ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయాలని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తోన్న విషయం తెలిసిందే.