బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న.. అక్టోబర్ 10న పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దాంతో రాజమౌళి పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు మరియు నెటిజన్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి బర్త్ డే విశేష్ తెలిపారు. ఇక ‘స్టూడెంట్ నెం. 1’తో మొదలైన దర్శక ధీరుడి కెరీర్ ‘ఆర్ఆర్ఆర్’ వరకు అంతకు మించి అనేలా సాగింది.
‘సింహాద్రి’,’సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన రాజమౌళి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ రేంజ్‌కు ఎదిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పుడు రాజమౌళి క్రేజ్ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. ఇకపోతే.. ప్రస్తుతం మహేశ్‌బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేయబోతున్నారు జక్కన్న. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఈ ఒక్క అప్టేట్ తప్పితే.. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ సోషల్ మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేస్తునే ఉన్నాయి.
లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా.. SSMB29 నుంచి ఏదైనా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేద్దామని నిర్మాత కేఎల్ నారాయణ చాలా ప్రయత్నాలు చేశారట. కానీ దానికి ఇంకా చాలా సమయం ఉంది.. ఇప్పుడే ఇలాంటివి వద్దని చెప్పారట రాజమౌళి. లేకుంటే ఈ పాటికే మహేష్-రాజమౌళి అప్టేట్ సోషల్ మీడియాను షేక్ చేసి ఉండేది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహేష్ కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ను విలన్ పాత్ర కోసం రంగంలోకి దింపబోతున్నాడట రాజమౌళి. ఏదేమైనా దర్శక ధీరుడు రాజమౌళికి మన తరపున కూడా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేద్దాం.