Venkaiah Naidu : రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయని, ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృ భాషలో ప్రాథమిక విద్య మొదలుపెట్టాలని కోరారు.
రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయని, ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృ భాషలో ప్రాథమిక విద్య మొదలుపెట్టాలని కోరారు.
ఈ సందర్భంగా మాతృభాషకి, ఇంగ్లిష్ భాషకు ఉన్న తేడాను వివరించారు. మాతృ బాష కళ్ల లాంటిదని…ఇంగ్లీష్ భాష కళ్ళద్దాల లాంటిదని వెంకయ్య నాయుడు తెలిపారు. ఇంగ్లీష్ బాష నేర్చుకోవాలని….ఇంగ్లీష్ సంస్కృతిని కాదని వెంకయ్య నాయుడు హితబోధ చేశారు.
మమ్మి డాడీ సంస్కృతి మనకవసరమా….? అంటూ ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తులు కులాలు, మతాల పేరుతో మనల్ని వేరు చేయాలని చూస్తున్నారని వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ఎడ్యుకేషన్ ఒక మిషన్….కమిషన్ కాకూడదు అన్నారు. క్లాస్ రూమ్ వరకే చదువు పరిమితం కాకూడదని వెంకయ్య నాయుడు కోరారు. బాడీ బిల్డింగ్ మాత్రమె కాదు నేషన్ బిల్డింగ్ కూడా చేయాలని పిలుపునిచ్చారు. తిండి విషయంలో కూడా దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఫాస్ట్ ఫుడ్ ను పక్కన పెట్టి….మిల్లెట్స్ తినడం అలవాటు చేసుకోవాలని కోరారు. హన్మకొండలోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.