JGL: పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదామని పర్యావరణ పరిరక్షణ సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గొల్ల రాజమల్లు కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం లక్షెట్టిపేట పట్టణంలో ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. గ్రామాలలో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న శ్రీరామ మూర్తి పాల్గొన్నారు.