Minister Roja : రాజధానిపై మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్…!
Minister Roja ఏపీ రాజధాని విషయంలో ఎవరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా... అధికార పార్టీ మాత్రం... ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. విశాఖను రాజధానిగా చేయాలని నిర్ణయం తీసేసుకుంది. దానికి సంకేతంగా... జగన్, రోజా, ఇతర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.
ఏపీ రాజధాని విషయంలో ఎవరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా… అధికార పార్టీ మాత్రం… ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. విశాఖను రాజధానిగా చేయాలని నిర్ణయం తీసేసుకుంది. దానికి సంకేతంగా… జగన్, రోజా, ఇతర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా… మంత్రి రోజా.. రాజధాని విషయంలో ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘ఢిల్లీ వాడు వెక్కిరించినా, మద్రాస్ వాడు వెళ్లగొట్టినా, హైదరాబాద్ వాడు గెంటేసినా, మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ తీర్చిదిద్దుతాం – నిజమైన ఆంధ్రోడు’ అంటూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
కాగా…. విశాఖపట్నంలో శుక్ర, శని వారాలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కు భారీగా పారిశ్రామిక దిగ్గజాలు తరలి వస్తున్న క్రమంలో ఈ సమ్మిట్‌కు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ సమావేశానికి సంబంధించిన వేదికలు సిద్ధం చేశారు. సుమారు 2 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికలకు అందంగా ముస్తాబవగా ఈ సమావేశానికి ఏడుగురు కేంద్ర మంత్రులు, 40 దేశాల నుంచి రాయబారులు, పాతిక దేశాల ప్రతినిధులు, మన దేశానికి చెందిన 30 మంది పారిశ్రామిక దిగ్గజాలు విశాఖ రాబోతున్నారు.