TG: రైతుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించొద్దని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి హితవు పలికారు. పట్నం నరేందర్‌రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారని ఆరోపించారు. గతంలో ఫార్మాసిటీకి బీఆర్ఎస్ 14 వేల ఎకరాలు ఇచ్చిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ ఎందుకు అని ప్రశ్నించారు. రైతులను ఇబ్బంది పెట్టడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు.