కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రధాని మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా, ఉక్రెయిన్ల మధ్య గత 2.5 ఏళ్లుగా నిరంతర యుద్ధం జరుగుతోంది. భారత్ కు చెందిన విద్యార్థులు ఆ దేశాల్లో ఉంటున్నారని గుర్తించిన మోదీ.. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడారు. ప్రధాని మాట్లాడినందుకు వారు యుద్ధాన్ని నాలుగున్నర గంటలు ఆపి మన పిల్లలను భారత్‌కు పంపించారు’ అని గుర్తుచేశారు.