AP: ఒక శాతం సర్చార్జ్ పెంచేందుకు సిద్ధమయ్యారని మాజీ ఎంపీ భరత్ అన్నారు. ట్యాక్స్ పెంచేందుకు సీఎం చంద్రబాబు కేంద్రం అనుమతి కోరారని విమర్శించారు. సంపద సృష్టించడమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ట్యాక్స్ పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.