TG: పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వాటర్ కనెక్షన్స్ సరిపోవడం లేదని, ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అక్కడ అదనపు కనెక్షన్స్ ఇవ్వాలని మంత్రి సూచించారు.