తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ విశేషాలంకరణలో భక్తులకు దర్శనమిస్తోంది. జాతర తరువాత మూడో మంగళవారం అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం వజ్రకిరీటం, స్వర్ణ ముఖకవచంతో అలంకరణ చేశారు. ఆలయం మొత్తం చెరుకులతో సుందరంగా తీర్చిదిద్దిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.