కాకినాడ రూరల్ కొవ్వూరులోని వారాహి ఆలయంలో ఈ నెల 4న (గురువారం) అమ్మవారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ EO సిహెచ్. ఎస్. ఎన్.ఎస్. శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఆలయ పారిశుద్ధ్యం, పరిశుభ్రత పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే యథావిధిగా అర్చక విధులు, పూజలు జరుగుతాయని వెల్లడించారు. భక్తులు గమనించాలని కోరారు.