MNCL: ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని అందిస్తామని జన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదావరి, ఎంపీవో గ్రామ కార్యదర్శి జలంధర్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.