ATP: విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని జిల్లా టీడీపీ నేతలు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మాజీ మంత్రి నిమ్మల కృష్ణప్ప, ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప, లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటశివయాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, వేద పండితులు వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.