TPT: తిరుమల లేపాక్షి సర్కిల్ వద్ద మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను దొంగిలించిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హ్యాండ్ బ్యాగ్, రూ.5,000 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారికి కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిందన్నారు. నిందితులు ఏపీ, తమిళనాడుకు చెందినవారని తెలిపారు.