SRD: కంగ్టి మండల తడ్కల్ జీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. జూన్ 2 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఎన్నో ఏళ్ల ఉద్యమం, వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు.