»Visakha Sarada Peetham Clarifies Over Supporting One Party
visakha sarada peetham: ఏ పార్టీకి అనుకూలం కాదు
తాము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోందని, కానీ అలాంటిది ఏమీ లేదని విశాఖ శారదా పీఠం (visakha sarada peetham) ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.
తాము ఒక రాజకీయ పార్టీకి (Political Party) అనుకూలంగా పని చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోందని, కానీ అలాంటిది ఏమీ లేదని విశాఖ శారదా పీఠం (visakha sarada peetham) ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తాము ఎవరికీ మద్దతుగా ఉండటం లేదని, అలాంటి ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అంతకుముందు హర్యానా కురుక్షేత్రం సమీపంలో లక్ష చండీ మహాయజ్ఞంలో (Laksha Chandi Maha Yajnam) పాల్గొన్నారు. అయితే ఈ యజ్ఞం ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం చేసినది కాదని చెప్పారు. మొదటి నుండి శారదా పీఠంపై (visakha sarada peetham) కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇందుకు తమకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ నాయకులు ఆశ్రమానికి రావడం మీడియాను ఆకర్షిస్తోందన్నారు.
గతంలో మీరు నిర్వహించిన రాజశ్యామల యాగం వల్లే ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిందనే ప్రచారం ఉందని, అలాగే ఈసారి తెలుగు రాష్ట్రాల నుండి అలాంటి యాగం చేయమని ఏ పార్టీ అయినా వచ్చిందా అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పందిస్తూ… ఎవరైనా పీఠాన్ని ఆశ్రయించి యాగం చేయమంటే చేస్తామని, కానీ తామంతట తాము ఒక వ్యక్తికి, పార్టీ కోసం చేయమని స్పష్టం చేశారు. ఢిల్లీలోను శారదా పీఠం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాగా, శారదా పీఠం వైసీపీకి అనుకూలంగా ఉందనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. పార్టీ పేరును ప్రస్తావించనప్పటికీ, ఈ అపవాదు ఉంది. దీనిపై ఇప్పుడు శారదా పీఠం స్పందించింది.