»Election Results 2023 Nagaland Tripura And Meghalaya Elections Results Live Updates
Election Results 2023 ఈశాన్యాన వీస్తున్న కమలం.. సాగుతున్న ఓట్ల లెక్కింపు
ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినా బీజేపీ గెలిచిన వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో అలానే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది. పార్టీల్లో చీలికను తీసుకువచ్చి వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ అధికారం చేపట్టిన విషయాలు తెలిసిందే. తాజాగా అదే మాదిరి కాషాయ పార్టీ అడుగులు వేయనుంది.
ఈశాన్య రాష్ట్రాల్లో (Eastern States) కమలం గాలి వీస్తోంది. త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ (Counting) మొదలుపెట్టారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాగాలాండ్, మేఘాలయలో బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. మళ్లీ అధికారం చేపట్టేందుకు ఎన్డీఏ బృందం తహతహలాడుతోంది. త్రిపురలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. మళ్లీ ఈ రాష్ట్రాల్లో పాగా వేయాలని కాషాయ పార్టీ బలంగా కోరుకుంటోంది. ఈ రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ 30 దాటిన పార్టీ అధికారం చేపట్టనుంది. కాగా ఓట్ల లెక్కింపు సాయంత్రం దాక కొనసాగుతుండగా.. మధ్యాహ్నంలోపు ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో స్పష్టంగా తెలియనుంది.
తాజా ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే మేఘాలయలో ఎన్ సీపీ (NCP) 28, బీజేపీ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
ఇక నాగాలాండ్ లో బీజేపీ 21, ఎన్ పీఎఫ్ (NPF) ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.
త్రిపురలో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. 24 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా.. ట్రిపా 10 స్థానాల్లో, వామపక్ష పార్టీలు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
నాగాలాండ్, మేఘాలయల్లో ఒక్కో అసెంబ్లీ స్థానం ఏకగ్రీవమయ్యాయి.
నాగాలాండ్ 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 183 మంది పోటీపడ్డారు.
మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
త్రిపురలో 60 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని లుమ్లా, జార్ఖండ్ లోని రామ్ ఘర్, తమిళనాడులోని ఈరోడ్, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ డిగి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది.
ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినా బీజేపీ గెలిచిన వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో అలానే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది. పార్టీల్లో చీలికను తీసుకువచ్చి వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ అధికారం చేపట్టిన విషయాలు తెలిసిందే. తాజాగా అదే మాదిరి కాషాయ పార్టీ అడుగులు వేయనుంది. అయితే గెలిచిన వారిని కాపాడుకునేందుకు ఇతర పార్టీలు సిద్ధమయ్యాయి. వెంటనే వారిని క్యాంపులకు తరలించాలని కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు భావిస్తున్నాయి.