NZB: కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బషీరాబాద్ శివారులోని కాడి చెరువు వద్ద అక్రమంగా మొరం తవ్వకాలపై చితా ఫోర్స్ మెరుపుదాడి చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సీపీ సాయి చైతన్య ఆదేశాలతో పోలీసు బృందం అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న కార్యకలాపాలను గుర్తించింది. ఈ క్రమంలో ఒక జేసీబీ, మొరాన్నిరవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.