»Students Alert Telangana Icet 2023 Notification Released
MBA, MCA కోసం ఈ పరీక్ష రాయాల్సిందే.. ఐసెట్ ప్రకటన విడుదల
ఐసెట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి వారి ర్యాంకు తగ్గట్టు కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్కుతాయి. విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చైర్మన్ సూచించారు.
పరీక్షలకు సమయం ఆసన్నమైంది. విద్యా సంవత్సరం (Education Year) త్వరలోనే ముగుస్తోంది. ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలి. పదో తరగతి తర్వాత ఒక్క ఇంటర్ మినహా మిగతా అన్ని కోర్సుల (Course)కు ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. పరీక్షలు రాస్తేనే సీట్లు వచ్చేవి. లేదంటే మేనేజ్ మెంట్ కోటాలో డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కోవాల్సిందే. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు త్వరలోనే జరుగనున్నాయి. మిగతా ఉన్నత చదువుల కోసం ప్రవేశ పరీక్షల (Entrance Exams) షెడ్యూల్స్ వెలువడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎంసెట్ (Telangana EAMCET) ప్రకటన రాగా.. తాజాగా ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) చదివేందుకు ఐసెట్ (ICET-2023) ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana State Council of Higher Education) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్ నోటిఫికేషన్ (ICET Notification) విడుదల చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి (Professor R.Limbadri) ప్రకటించారు. కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) ఇప్పటివరకు 13 సార్లు ఐసెట్ ను నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా కేయూ పరిధిలోనే ఐసెట్ నిర్వహిస్తుందని తెలిపారు. మే 26, 27 తేదీల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థులు ఆన్ లైన్ https://icet.tsche.ac.in/లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 6వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అయితే మే 6 వరకు అవకాశం కల్పించారు. రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 12 నుంచి 18 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష కూడా ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. పరీక్ష కీ జూన్ 5న, జూన్ 20న తుది ఫలితాలను విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. ఐసెట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి వారి ర్యాంకు తగ్గట్టు కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్కుతాయి. విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చైర్మన్ సూచించారు.