KKD: పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో చంటి పిల్లల డాక్టర్ జయకృష్ణ బుధవారం తెల్లవారు జామున మృతిచెందారు.గతంలో మండల పరిషత్ అధ్యక్షులుగా జయకృష్ణ సేవలు అందించారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.