రూ.5 కోట్లు ఇవ్వకపోతే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ ఇటీవల బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కర్ణాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన గేయ రచయిత సోహెల్ పాషా(24)గా గుర్తించారు. తాను రాసిన ఓ పాట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సోహెల్ ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.