TG: లగచర్ల ఘటనలో కీలక సూత్రధారి సురేశ్ తమ పార్టీ నాయకుడే అని మాజీమంత్రి కేటీఆర్ మీడియాకి తెలిపారు. అధికారులపై దాడి సమయంలో సురేశ్ ఎవరినీ కొట్టలేదని స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సురేశ్ మాట్లాడాడని వెల్లడించారు. సురేశ్ భూమి కూడా ఈ ప్రాజెక్టులో పోతోందని చెప్పారు. ఫార్మా సిటీపై ప్రభుత్వం హైకోర్టులో ఒక మాట.. బయట మరో మాట చెబుతోందని మండిపడ్డారు.