భద్రాద్రి: మత్స్య పరిశ్రమ అభివృద్ధితో ఆరోగ్యవంతమైన సమాజంతో పాటు వాటితో ఆదాయం చేకూరుతాయని డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్యకార సంఘాలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే చేప పిల్లలు ఆయన పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని తొమ్మిది చెరువులలో 5,40,750 చేప పిల్లలు పంపిణీ చేసామని తెలిపారు.