రాబోయే ఐదేళ్లలో మరో 75వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రధాని మోదీ తెలిపారు. బిహార్లోని దర్బంగాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లను జోడించామని చెప్పారు. త్వరలో హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్యను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. 1.5 లక్షలకు పైగా ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’ బడుగు బలహీనవర్గాలకు సేవలందిస్తున్నాయని అన్నారు.