TG: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాజీమంత్రి కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపై ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాటం చేస్తామని తెలిపారు. నరేందర్ సతీమణి శ్రుతితో మాట్లాడిన కేటీఆర్.. BRS తమ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నరేందర్ అరెస్టుపై కోర్టులో పోరాడుతామన్నారు.