NLR: ఉదయగిరి పంచాయతీరాజ్ శాఖ ఏఈ శ్రీనివాస రాజుపై మండల ఉపాధ్యక్షుడు గుంటుపల్లి మాలకొండయ్యతోపాటు మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదు చేశారు. మండలంలో గ్రామపంచాయతీ నిధులు ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి సర్పంచ్, ఎంపీటీసీలకు సహకరించకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు.