TG: లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందనుకోవటం లేదని ఎంపీ డీకే అరుణ అన్నారు. ‘ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామాల్లో వ్యతిరేకత ఉంది. అయినా ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌కు అంత ప్రేమ ఎందుకో. కలెక్టర్ వెళ్లినప్పుడు ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదు. ఘటన జరిగినప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేశారు. గ్రామాల్లో ఏమైనా ఉగ్రవాదులు ఉన్నారా? శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైంది’ అని మండిపడ్డారు.