GNTR: గుజ్జనగుండ్ల JKC నగర్ 1వ లైను వద్ద రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పట్టాభిపురం పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.