ఫుడ్ ఐటమ్స్ డెలివరీ విషయంలో ఈ కామర్స్ సంస్థలకు FSSAI కీలక ఆదేశాలిచ్చింది. డెలివరీ సమయానికి ఫుడ్ ఐటమ్స్ నిల్వకాలం మరో 30 శాతం ఉండేలా చూసుకోవాలని చెప్పింది. లేదా ఎక్స్పైరీ డేట్ కనీసం మరో 45 రోజులుండాలని పేర్కొంది.లేబుల్స్‌పై లేని సమాచారాన్ని ప్రకటనల్లో చూపించవద్దని పేర్కొంది. ఆహార, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చెయ్యాలని తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని చెప్పింది.