»Sachin Tendulkar On His Life Size Statue At Wankhede Stadium
Sachin Tendulkar: వాంఖేడేలో అరుదైన గౌరవం, సచిన్ ఏమన్నారంటే
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం. ముంబైలోని (Mumbai) వాంఖేడే స్టేడియంలో (Wankhede Stadium) మాస్టర్ బ్లాస్టర్ నిలువెత్తు విగ్రహాన్ని (Sachin Tendulkar Life size Statue) పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం. ముంబైలోని (Mumbai) వాంఖేడే స్టేడియంలో (Wankhede Stadium) మాస్టర్ బ్లాస్టర్ నిలువెత్తు విగ్రహాన్ని (Sachin Tendulkar Life size Statue) పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అమోల్ కాలే ప్రకటన చేశారు. ఇలా ఒక ఆటగాడికి స్టేడియంలో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. వన్డే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీ (world cup mega tourney) సందర్భంగా దీనిని ఆవిష్కరించనున్నారు. 2023 క్రికెట్ వరల్డ్‌కప్ సందర్భంగా ఎంసీఏ లాంజ్ బయట ఉన్న సర్క్యులర్ ప్లాట్‌ఫామ్‌పై సచిన్ విగ్రహాన్ని (Sachi Tendulkar Statue)ఏర్పాటు చేయనున్నట్లు అమోల్ కాలే తెలిపారు. MCA ఈ ఏడాది లిటిల్ మాస్టర్ కోసం గోల్డ్ జూబ్లీ ఇయర్ ఉత్సవాలను నిర్వహించనున్నది. ఈ ఉత్సవాల్లో భాగంగా సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాలను అమోల్ కాలే మీడియాకు వెల్లడించినప్పుడు సచిన్ ఆయన పక్కనే ఉన్నాడు.
ఈ సందర్భంగా సచిన్ కూడా మాట్లాడారు. MCA తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. 1988లో ఇక్కడే తాను తన కెరీర్ స్టార్ట్ చేశానని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. వాంఖడే స్టేడియం తనకు ఎంతో ప్రత్యేకం అన్నాడు. ఈ స్టేడియంతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదని, తన తొలి రంజీ మ్యాచ్ ను, చివరి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా ఇదే వేదికపై ఆడానని గుర్తు చేసుకున్నాడు. తన కోచ్ అచ్రేకర్ సర్, తనను ఇక్కడకు తీసుకొని వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ గా మారిపోయానని తెలిపాడు. వాంఖేడేకు వస్తే తన జీవన చక్రం కళ్ళ ముందు తిరుగుతుందన్నాడు. ఇక్కడ తనకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని, ఇప్పుడు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే, తన జీవితంలో ఇదే అతిపెద్ద సంఘటనగా నిలిచిపోతుందన్నాడు. ఇప్పుడు తాను పాతికేళ్ల అనుభవంతో 25 ఏళ్ల యువకుడిగా ఉన్నానని, ఇలాంటి గొప్ప గౌరవం అందించిన MCAకు ధన్యవాదాలు చెప్పాడు. వాంఖేడే తనకు అత్యంత ప్రత్యేక ప్రదేశమని పేర్కొన్నాడు. విగ్రహంపై MCA తనకు సమాచారం అందించిందని, అందుకే విగ్రహం ఎలా ఉండాలి, స్టేడియంలోని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయాలి అనే అంశాలపై చర్చించేందుకు ఈ రోజు మంగళవారం వాంఖేడేకు వచ్చానని, ఇలాంటి సందర్భాలు అరుదుగా వస్తాయన్నాడు.
సచిన్ టెండుల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) కెరీర్లో మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు, 463 వన్డే మ్యాచ్‌లు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి మొత్తం 34,357 పరుగులు చేశాడు. అంతేగాక అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇందులో వన్డేల్లో 18,426, టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. టీ20ల్లో 10 పరుగులు చేశాడు. 2011లో సచిన్ తనకు ఇష్టమైన వాంఖడే స్టేడియంలోనే క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుపొందాడు. ఇదిలా ఉండగా, భారత్ లో క్రికెటర్ల విగ్రహాలకు సంబంధించి తొలి టెస్ట్ జట్టు కెప్టెన్ సీకే నాయుడుకు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. మూడు వేర్వేరు సైజులలో విగ్రహాలను ఏర్పాటు చేశాయి ఆయా క్రికెట్ సంఘాలు. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం, నాగపూర్ లోని విదర్భ స్టేడియం, ఆంధ్రప్రదేశ్ లోని వీడీసీఏ స్టేడియాలలో సీకే నాయుడు విగ్రహాలు ఉన్నాయి.