HYD జూబ్లీహిల్స్‌లోని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటికి AP పోలీసులు చేరుకున్నారు. వర్మకి నోటీసులు ఇచ్చి.. విచారణకు పిలిచేందుకు మద్దిపాడు పోలీసులు HYD వచ్చారు. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ని కించపరిచే విధంగా వర్మ పోస్టింగ్స్ పెట్టాడని మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫొటోలు పోస్టు చేశాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.