»Parents To Be Sent To Labour Camp Children To 5 Year Jail In North Korea Why
North korea rules:లేబర్ క్యాంపునకు పేరంట్స్, పిల్లలకు ఐదేళ్ల జైలు.. ఉత్తర కొరియా కొత్త రూల్స్
North korea strict rules:ఉత్తర కొరియాలో (north korea) కఠిన నియమ, నిబంధనలు అమలవుతాయి. అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ (Kim Jong Un) ఎవరినీ వదిలిపెట్టరు. ఉత్తర కొరియా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాశ్చాత్య సంస్కృతి, మీడియా అణచివేసేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Parents to be sent to labour camp, children to 5-year jail in north korea..why?
North korea strict rules:ఉత్తర కొరియాలో (north korea) కఠిన నియమ, నిబంధనలు అమలవుతాయి. అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ (Kim Jong Un) ఎవరినీ వదిలిపెట్టరు. ఎవరిపై దయ, జాలి, కరుణ అనేవి ఉండవు. గత కొంతకాలంగా అమెరికా వర్సెస్ ఉత్తర కొరియా మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తన ఆయుధ సంపత్తిని అమెరికాకు చూపించే ప్రయత్నం చాలాసార్లే చేసింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాశ్చాత్య సంస్కృతి, మీడియా అణచివేసేందుకు చర్యలకు ఉపక్రమించింది.
హాలీవుడ్‌కు చెందిన సినిమాలు (hollywood movies), లేదంటే టీవీ ప్రోగ్రామ్స్ (tv programmes) ఉత్తర కొరియాలో (north korea) నిషిధ్దం. అలా కాదని పిల్లలు వాటిని చూస్తే కఠిన శిక్ష అమలు చేస్తారు. ఒకటి పిల్లలకు ఐదేళ్ల జైలు (five year jail) శిక్ష.. అలా కాదంటే పేరంట్స్‌ను (parents) నిర్బంద కార్మిక శిబిరంలో ఉంచుతారట. ఈ మేరకు మిర్రర్ తన కథనంలో పేర్కొంది.
చదవండి:Elon Musk: మస్క్ ఈజ్ బ్యాక్..మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు
ఇదివరకు ఇలా జరిగితే దోషులుగా తేలిన పేరంట్స్ కఠినమైన హెచ్చరికలతో తప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. పొరుగున ఉన్నవారిని తప్పకుండా పరిశీలిస్తారని.. పొరపాటు చేస్తే సమాచారం అందుతుందని పేర్కొంది. వద్దని చెప్పిన సినిమాలు చేస్తే.. ఆ పేరంట్స్ పట్ల దయచూపించమని ‘రేడియో ఫ్రీ ఆసియా’ (radio free asia) రిపోర్ట్ చేసింది.
అంతేకాదు కిమ్ జోంగ్ ఉన్ (kim jong un) సోషలిస్ట్ ఆదర్శాలకు అనుగుణంగా పిల్లలను పెంచడం లేదని కొరియా స్థానిక పరిపాలన సంస్థ ఇన్మిన్బ్యాన్ వారిని హెచ్చరించింది. ఇదీ కేవలం సినిమాలకే పరిమితం కాదని.. డ్యాన్సింగ్, పాటలు పాడేవారిపై కూడా నియంత్రణ అని అంటున్నారు. అలాగే దక్షిణ కొరియా (south korea) మాదిరిగా పిల్లలు ఆడినా, పాడినా ఆరు నెలల (six months) జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది. హాలీవుడ్ (hollywood) బ్లాక్ బస్టర్ మూవీ చూస్తే తల్లిదండ్రుల కోసం జైల్లు ఎదురుచూస్తున్నామని స్పష్టంచేసింది.