ASR: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా డుంబ్రిగూడలో దుకాణాలు, గృహాలు బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు కూల్చివేస్తామని చెప్పడం చాలా బాధాకరమన్నారు. దుకాణాలు, గృహాలు కూల్చివేస్తే తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.