BHPL: వైద్యశాఖ అన్ని విభాగాల సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర సిబ్బందితో వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది ప్రతిరోజు తప్పనిసరిగా గూగుల్ టైం పాండ్ ఫొటోలను గ్రూపులో పెట్టాలని, వాటిని పరిశీలన చేస్తామని తెలిపారు.