AP: వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ‘కీలకమైన బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మోసం చేయడం బాధాకరం. నిజాయితీ ఉంటే మీరు ఇలాంటి అవివేకమైన చర్యలకు పూనుకోరు. ఒక వ్యక్తి అహంకారాన్ని మీలో నింపుకుని మీరు చూపుతున్న ఈ నిర్లక్ష్యం వల్ల నష్టపోయేది ప్రజలు. మీ నాయకుడి అజ్ఞానానికి మీరు బలికాకూడదని అనుకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీలో అడుగుపెట్టండి’ అని లేఖలో పేర్కొన్నారు.