TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనలో 55 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం పరిగి పీఎస్ నుంచి 40 మందిని విడుదల చేశారు. మరో 15 మంది రైతులను విచారిస్తున్నారు. ఈ దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. అధికారులపై దాడి చేసిన వారితోపాటు గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడైన సురేశ్‌ది BRS పార్టీగా గుర్తించారు.