AP: సిడ్నీ కామన్వెల్త్ సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొనడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రతినిధుల పట్ల ఇతర అంశాలపై చర్చించామన్నారు. సోషల్ మీడియా పోస్టులతో మహిళలు మానసికంగా కుంగిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించి ఆత్మస్థైర్యాన్ని నింపాలని సూచించారు.