సౌతాఫ్రికాతో రేపు జరగనున్న మూడో టీ20లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను జట్టు నుంచి తప్పించనున్నట్లు సమాచారం. అలాగే పేసర్ అవేష్ ఖాన్‌ను కూడా బెంచ్‌కు పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిషేక్ స్థానంలో రమణ్ దీప్, అవేష్ స్థానంలో వైషాక్ విజయ్‌కుమార్‌కు తుది జట్టులో అవకాశం లభించనుంది.