పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టును పంపబోమని BCCI తేల్చిచెప్పింది. అయితే సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌కు పాకిస్థాన్ అభిమాని నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. ‘ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి పాకిస్థాన్‌కు ఎందుకు రావడం లేదో చెప్పండి’ అంటూ సూర్యను ప్రశ్నించాడు. దానికి సూర్య.. ‘ఆ విషయం మా చేతుల్లో లేదు బ్రదర్’ అంటూ సమాధానమిచ్చాడు.