BHPL: కాలేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఇంద్రాణి కాళీ కాలభైరవ శక్తిపీఠం ఉపాసకులు రామకృష్ణ అఘోరి శుక్రవారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో శంఖనాదం చేయడంతో ఆలయం భక్తి వాతావరణంతో మారుమోగింది.