1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో యూదు అధికారి, లెఫ్టినెంట్ జనరల్ జెఎఫ్ఆర్ జాకబ్ కీలకంగా వ్యవహరించారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. కాగా ఆయనకు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ఘనంగా నివాళులర్పించారు. కోల్కతాలో జన్మించిన జాకబ్, 37 ఏళ్ల పాటు భారత సైన్యంలో విశేష సేవలందించారు. ఆయన దేశం పట్ల చూపిన ధైర్యసాహసాలను ప్రధాని స్మరించుకున్నారు.