మార్కాపురం: రేపు నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పొదిలిలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక రథం రోడ్డులోని సాయి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. తనతో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జేసీ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొంటారని చెప్పకొచ్చారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని పేర్కొన్నారు.