KMR: దేవునిపల్లిలోని కాసర్ల విహార్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో నేడు ‘స్ట్రాంగ్ డాటర్ స్ట్రాంగ్ మిషన్’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వాహకులు కాసర్ల రవీందర్ ప్రారంభించారు. క్రీడాకారులకు జెర్సీలను అందజేసిన అనంతరం మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు బాలికల ఎదుగుదలపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించాలన్నదే లక్ష్యం అన్నారు.