SKLM: మందస మండలంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరిపురం, మందస టౌన్ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.