ADB: జైనథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనిచేసే ప్రాంతానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఈ మేరకు ఆర్టీసీ డీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.