MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో వారాంతపు మేకలు, గొర్రెల సంతజోరుగా సాగుతున్నది. బక్రీద్ పండుగ నేపథ్యంలో గొర్రె పొట్టేళ్లకు డిమాండ్ ఏర్పడడంతో విక్రయిదారులు పదివేల పైననే విక్రయిస్తున్నారు. ఈ సంతలో క్రయవిక్రయాలకు చుట్టుపక్కల గ్రామస్తులే కాక కర్నూల్, గద్వాల, ఆమనగల్, కల్వకుర్తి, మహబూబ్ నగర్, షాద్ నగర్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారు.